‘బాహుబలి ది ఎపిక్’ పై క్రేజీ రూమర్.. చివరలో సర్ప్రైజ్?

‘బాహుబలి ది ఎపిక్’ పై క్రేజీ రూమర్.. చివరలో సర్ప్రైజ్?

Published on Oct 5, 2025 6:59 PM IST

Baahubali: The Epic

పాన్ ఇండియా సినిమా రూపు రేఖలు మార్చేసిన చిత్రం “బాహుబలి” కోసం అందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ల ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా అయితే ఇప్పుడు దీని తర్వాత ఎంతోమంది దర్శకులు, హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్నారు. అయితే చరిత్ర తిరగరాసిన బాహుబలి సినిమాలు రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రాల ట్రీట్ తో థియేటర్స్ లో ఓ క్రేజీ సర్ప్రైజ్ ఉంటుంది అన్నట్టుగా పలు రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. దీని ప్రకారం బాహుబలి ది ఎపిక్ స్క్రీనింగ్ అయ్యాక పార్ట్ 3 అనౌన్సమెంట్ అందులో ఉంటుందని వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ నిజం అయితే మాత్రం ఆ అనౌన్సమెంట్ ఫీవర్ మామూలు లెవెల్లో ఉండదని చెప్పవచ్చు. అది తెలియాలి అంటే ఈ అక్టోబర్ 31 వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు