‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఐతే, తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ ఎత్తున స్పెషల్ విఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. మొత్తానికి ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట.
పైగా అందులో ఒక సాంగ్ ను హృతిక్ రోషన్ – కియరాపై తీశారు. కియరా బికినీలో కనిపిస్తోందట. ఇక రెండో పాటను హృతిక్-ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. వచ్చే నెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.