సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ పీరియాడిక్ మూవీ?

టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ దిగ్దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ ఓ భారీ పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఎప్పటినుండో ఆయన ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయాలని ప్రయత్నింస్తుండగా అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయని వినికిడి. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో హీరో రణ్వీర్ సింగ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ కీలక రోల్ చేయనున్నాడట. మరి ఇదే కానుక నిజం అయితే ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ తరువాత ఓ బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది.

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ ఇండియా లెవెల్ కి చేరుతుందని తెలుస్తుండగా, ఈ ప్రాజెక్ట్ ఆయన ఇమేజ్ మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ కొద్దిరోజులలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే తన 30వ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

Exit mobile version