‘చరణ్ 16’ ఓటిటి హక్కులకు భారీ డిమాండ్!?

‘చరణ్ 16’ ఓటిటి హక్కులకు భారీ డిమాండ్!?

Published on Mar 14, 2025 3:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ అంతా శరవేగంగా పూర్తవుతుంది. అయితే దీనికి ముందు చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా కనిపించడం లేదనే తెలుస్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటి డీల్ పై క్రేజీ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే భారీ ఆఫర్స్ ని పలు టాప్ ఓటిటి సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. మెయిన్ గా సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తో డీల్ ఫైనల్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా ఇందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడంతో మేకర్స్ నెట్ ఫ్లిక్స్ తో టైఅప్ కానున్నట్టుగా టాక్. మరి చూడాలి ఈ సినిమాని ఎవరు సొంతం చేసుకుంటారు అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు