పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత రియల్ హైప్ తో వస్తున్న స్ట్రైట్ చిత్రమే “ఓజి”. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ చిత్రం పట్ల ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఇలా ఓజి సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆల్రెడీ బుకింగ్స్ పరంగా మంచి కిక్ కూడా వస్తుంది. యూఎస్ మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన ఓజి మంచి ఊపులో ఉంటే ఇంకో క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
ఆల్రెడీ గట్టి హైప్ ఉన్న ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్ కూడా చేయనున్నారని వినిపిస్తుంది. గత చిత్రం హరిహర వీరమల్లు సినిమాకి పవన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో చివరి నిమిషంలో గట్టి హైప్ వచ్చింది. ఇక ఆల్రెడీ హైప్ ఉన్న సినిమా కోసం పవన్ మళ్ళీ ప్రమోషన్స్ కోసం వస్తే అది ఊహించని రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.