క్రేజీ బజ్: పవర్ స్టార్ తో లోకేష్ కనగరాజ్.. అతడు కూడా లైన్లో?

lokesh-kanagaraj-pawan-kaly

రీసెంట్ గా ఓజి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రేంజ్ ఏంటో చూపించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ హీరోగా ఈ తరహా సినిమాలు చేస్తే దాని తాలూకా ఇంపాక్ట్ ఈ లెవెల్లో ఉంటుంది అని చాలా మందికి ఓ క్లారిటీ వచ్చింది. పవన్ స్టామినాకి తగ్గట్టుగా ఓ సరైన దర్శకుడు దొరికితే ఓజి చూపిస్తే ఇప్పుడు పవన్ లైనప్ లో ఓ తమిళ స్టార్ దర్శకుడు లైన్ లోకి వచ్చినట్టుగా క్రేజీ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా పవన్ తో చేసే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ పవన్ తో సినిమా లాక్ చేసుకోగా అందులో లోకేష్ కనగరాజ్ లేదా హెచ్ వినోద్ (ఖాకీ, ఇప్పుడు జన నాయకుడు) ఫేమ్ దర్శకుడు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా పడినా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పవచ్చు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version