‘ఏజెంట్ చింగ్’.. ఈ యాడ్ బడ్జెట్ చూస్తే షాకవ్వాల్సిందే..!

బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ ప్రస్తుతం సాధారణ విషయమని చెప్పాలి. అయితే, కొందరికి మాత్రమే బడ్జెట్ పెంచుతూ నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ చేసిన పని బాలీవుడ్‌తో పాటు మిగతా ఇండస్ట్రీల వారిని అవాక్కయ్యేలా చేస్తోంది.

‘ఏజెంట్ చింగ్ అటాక్స్’ అంటూ బాలీవుడ్‌లో తెరకెక్కిన ఓ యాడ్ కోసం ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ యాడ్‌ను దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ యాడ్‌లో రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల, నటుడు బాబీ డియోల్ కలిసి నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. భారీ యాక్షన్ సినిమాలకంటే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాడ్ అసలు ఏమిటనేది ప్రేక్షకులకు అంతుబట్టడం లేదు.

ఇక ఈ యాడ్ ఏమిటనే విషయాన్ని అక్టోబర్ 19న రివీల్ చేయబోతున్నారు మేకర్స్. మొత్తానికి ఈ యాడ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Exit mobile version