అంజలికి గడువు పెట్టిన కోర్టు

anjali

తన నటన, టాలెంట్ తో అంజలి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. గత కొద్ది రోజుల క్రితం సడన్ గా కనపడకుండా పోయి సంచలనాన్ని నెలకొల్పింది. ఈ విషయం అప్పట్లో అంతా పబ్లిక్ మయం కావడమే కాకుండా ఆమె పిన్ని అయిన భారతి దేవి పై చెన్నై హై కోర్టులో పిటీషన్ కూడా వేసారు. ఆ పిటీషన్ నిన్న హియరింగ్ కి వచ్చింది. ఈ కేసుకు సంబందించిన ఇద్దరు లాయర్లు హాజరయ్యారు అలాగే అంజలి లాయర్ ఈ కేసుని ముగించేయమని కోరగా, భారతి దేవి లాయర్ మాత్రం దాన్ని అలా జరగకూడదని వారించారు.

‘భారతి దేవి అంజలి సినిమా చేస్తుందని కొంతమంది నిర్మాతల నుండి అడ్వాన్స్ తీసుకుంది. కానీ ప్రస్తుతానికి ఆమె అందుబాటులో లేదు. అంజలి కోర్టుకు హాజరు కావాలని ‘ భారతి దేవి లాయర్ జడ్జ్ ని కోరారు. ఇలా ఇద్దరి వాదనలు విన్న హై కోర్టు అంజలి జూలై 9 లోపు కోర్టుకు హాజరు కావాలని తెలిపింది అలాగే ఇదే విషయాన్ని పోలీస్ లకు కూడా తెలిపింది.

Exit mobile version