యూఎస్‌లో మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తున్న ‘కోర్ట్’

యూఎస్‌లో మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తున్న ‘కోర్ట్’

Published on Mar 18, 2025 11:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘కోర్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తోంది. దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ముఖ్య పాత్రల్లో తమ నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 750K డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన ప్రొడక్షన్ హౌజ్ సత్తా చాటాడు. ఇక ఈ సినిమాకు అజయ్ బుల్గనిన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు