వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘కోర్ట్’

Court

న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కోర్టు రూమ్ డ్రామా ‘కోర్ట్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ జగదీష్ ఓ డెలికేట్ పాయింట్‌తో నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ లీడ్ రోల్స్ నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈటీవీ ఛానల్‌లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు బుల్లితెరపై కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version