డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అన్ని కరోనా మహమ్మారి రాకతో రూపురేఖలనే మార్చుకున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్న క్రమంలో మారుతి, సుకుమార్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెబ్ సిరీస్ లలో భాగం అవుతున్నారు.
అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసిన్నట్లు తెలుస్తోంది. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఆహా కోసం పూర్తి అయిన కొన్ని చిన్న సినిమాల్ని కొనబోతున్నారట. సినిమా బాగుంటే భారీ మొత్తంలోనే ఇచ్చే అవకాశం ఉంది.
మరి చిన్న నిర్మాతలకు ఇది మంచి అవకాశమే. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెనింగ్ కోసం ఎదురుచూడకుండా ఒటిటిలో సినిమాని రిలీజ్ చేసుకుని సేవ్ అవ్వడం బెస్ట్ అని కొంతమంది చిన్న నిర్మాతలు సైతం ఫీల్ అవుతున్నారు. మొత్తానికి కరోనా వల్లే చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది.