సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో ప్రస్తుతం టికెట్ బుకింగ్ ట్రెండ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాని చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఇక తమిళనాడులో ఈ పోటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
అక్కడ కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా టికెట్స్ కోసం యుద్ధమే జరుగుతుంది. అయితే ఓ థియేటర్ లో ఈ సినిమా టికెట్స్ బ్లాక్ లో అమ్ముతున్నారని.. ఒక్కో టికెట్ ధర రూ. 4 వేలు ఉన్నా ఫ్యాన్స్ వెనకడుగు వేయడం లేదని తమిళ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
ఇది రజినీ మేనియా అంటూ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.