తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారా అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను ఏషియన్ సునీల్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.52 కోట్లకు ఏషియన్ సునీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాట పట్టాలంటే రూ.100 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ రాబట్టడం చాలా సులువు. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.