‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన సినిమా కూలీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. సినిమా పై ఎన్ని విమర్శలు వచ్చినా, కూలీ సినిమా కోలీవుడ్ లో మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹380 కోట్ల గ్రాస్ తో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రతికూల సమీక్షలతో ఇంతటి రికార్డు స్థాయి కలెక్షన్స్ ను సాధించడం అంత సులభం కాదు, కానీ కూలీ అద్భుతంగా కలెక్షన్స్ ను రాబట్టింది.

నిజానికి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ ఎప్పుడైతే తెరుచుకున్నాయో అప్పుడు నుంచే సాలిడ్ బుకింగ్స్ అయ్యాయి. డే 1 కి మాత్రం తమిళ సినిమా నుంచి రికార్డు ఓపెనర్ గా నిలిచింది ఈ సినిమా. పైగా మొదటి రోజున కూలీ సినిమా సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ ని ఓపెన్ సాధించింది. ఈ సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, పూజా హెగ్డే (పాటలో ప్రత్యేక పాత్ర), అమీర్ ఖాన్ (అతిథి పాత్ర) తదితరులు నటించారు.

Exit mobile version