అక్కడ ‘కూలీ’కి మ్యాడ్ రెస్పాన్స్..!

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఉపేంద్ర, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కూలీ’. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకి ముందే యూఎస్ మార్కెట్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఈ సినిమా అక్కడ ఇప్పుడు ఏకంగా 50 వేలకి పైగా టికెట్స్ ని సేల్ చేసుకోగా వసూళ్లు కూడా అప్పుడే 1.3 మిలియన్ మార్క్ ని కూడా దాటేసింది. దీనితో రజినీకాంత్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ రెస్పాన్స్ గా ఇది నిలిచింది అని చెప్పాలి. ఇక విడుదల అయ్యే రోజుకి ఈ నంబర్స్ ఎక్కడ వరకు వెళతాయి అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version