తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, అదే రోజున నార్త్‌లో తెరకెక్కిన ‘వార్-2’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ రెండు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నా.. ‘వార్-2’తో పోలిస్తే ‘కూలీ’ ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే కూలీ చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా… తాజాగా ‘మోనిక’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
కానీ, వార్-2 నుంచి ఇప్పటికి కేవలం ఓ వీడియో గ్లింప్స్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా వార్-2 మేకర్స్ తమ సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్‌ను వదిలి సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయాల్సిన అవసరం ఉంది.