మహేష్ నెక్స్ట్ పై ఆగని రూమర్స్..!


బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు భారీ హిట్లతో ట్రాక్ లోకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మరిన్ని భారీ ప్రాజెక్టులతో సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా మరో స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ కు శ్రీకారం చుట్టినట్టుగా దర్శకుడు పరశురామ్ తో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రాన్ని మొదలు పేట్టేసారు. కానీ దీని తర్వాత చేయనున్న 28 వ చిత్రానికి సంబంధించి మాత్రం అనేక రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అలాగే అవి మరింత స్థాయిలో ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మాది టాప్ దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో హిట్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. అది మరెవరో కాదు. తన లాస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” తో భారీ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి. ఇప్పుడు రేస్ లోకి అనీల్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ మహేష్ నెక్స్ట్ పై మాత్రం ఈ రూమర్స్ ఆగట్లేదు. మరి దీనికి సంబంధించి ఏదొక అధికారిక అప్డేట్ వస్తే కానీ ఏదొక క్లారిటీ వచ్చేలా లేదు.

Exit mobile version