‘ఓజి’, ‘కూలీ’ వరుస బ్లాస్ట్ ల పైనే అందరి కళ్ళు!

మూవీ లవర్స్ కి ఇదొక బిగ్ డే అనే చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హైప్ ఉన్న రెండు చిత్రాలు ఓజి అలాగే కూలీ ల నుంచి నేడు అవైటెడ్ ట్రీట్ లు రాబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ కలయికలో థమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ఎపుడు నుంచో మోస్ట్ అవైటెడ్ గా ఉంది. దీనిపై ఉన్న అంచనాలు పవన్ ఫ్యాన్స్ వర్ణించలేరు కూడా..

ఇక ఇలానే సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సినిమా కూలీ ట్రైలర్ పై కూడా ఇప్పుడు ఇదే రేంజ్ హైప్ పాన్ ఇండియా భాషల్లో నెలకొంది. ముఖ్యంగా వార్ 2 ట్రైలర్ వచ్చాక కూలీ ట్రైలర్ అంచనాలు అందుకుంటుందా లేదా అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారింది. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు కూడా ఈ సాయంత్రం గంట వ్యవధిలో వస్తుండడంతో అందరి కళ్ళు వీటి మీదే ఉన్నాయి. మరి ఇవి ఎలాంటి ట్రీట్ ఐ అందిస్తాయో చూడాల్సిందే.

Exit mobile version