వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతూ కెరీర్ ను కొనసాగించిన అనుష్క ‘మిర్చి’ సినిమా హిట్ తో మళ్ళీ ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధానపాత్రలో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి 3D’ సినిమాలు వివిధ దశలో వున్నాయి. ఇటీవలే ఈ భామ త్వరలో ‘భాగమతి’ అనే సినిమా చెయ్యనుంది అని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా తాలూకూ సభ్యులు వేరే కధను చెప్తున్నారు.
ప్రస్తుత కధ ప్రకారం 16వ శతాబ్దంలో కులీ కుతుబ్ షాహ్, భాగమతి ప్రేమాయణ కధ అయిన ఈ ప్రణయగాధను తెరకెక్కిస్తున్నారు అన్నారు. అయితే వర్ణ ఆడియో లాంచ్ లో తనకు కుటుంబకధా చిత్రాలు కానీ, రొమాంటిక్ సినిమాలు కానీ చేయాలని ఉందని, కత్తి పట్టే పాత్రలు ఇప్పట్లో వద్దని తెలిపింది. కాబట్టి ఈ చారిత్రాత్మక చిత్రమనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ఈ సినిమాను తెరకెక్కించనున్న అశోక్ ‘భాగమతి’ చారిత్రాత్మక నేపధ్యమున్న సినిమా కాదని, ఇది ఈ కాలంలో సాగానున్న సోషల్ డ్రామా అని, ఈ కధకు కులీ కుతుబ్ షాహ్, భాగమతిల చరిత్రకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. కనుక ఈ పుకార్లను అధికారిక ప్రకటన వెలువడే దాకా భరిస్తే చాలు. ఈ సినిమాను మిర్చి ని నిర్మించిన వంశీ, ప్రోమోద్ లు 2014నుండి తమ బ్యానర్ లో మొదలుపెట్టనున్నారు.