పెయిడ్ ప్రీమియర్స్ కి ‘మిత్రమండలి’ రెడీ !

వచ్చే వారం మంచి ఎంటర్టైన్మెంట్ తో అలరించేందుకు వస్తున్న చిత్రాల్లో “మిత్రమండలి” కూడా ఒకటి. యువ హీరో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, రాగ్ మయూర్ మరియు విష్ణు ఓయ్ ఇంకా ప్రసాద్ బెహరా లాంటి టాలెంటెడ్ నటుల కలయికలో దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ కంటెంట్ తో రాబోతుంది.

ఈ సినిమా అక్టోబర్ 16, 2025న థియేటర్లలోకి రానుంది. ఐతే, దీపావళి స్పెషల్‌గా, మేకర్స్ అక్టోబర్ 15, 2025న పెయిడ్ ప్రీమియర్‌లను ఏర్పాటు చేశారు, బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయి. సినిమా కంటెంట్‌పై మేకర్స్ కి ఉన్న నమ్మకానికి ఈ పెయిడ్ ప్రీమియర్స్ నిదర్శనం. ఇక ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ మరియు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించి, బివి వర్క్స్ పతాకంపై బన్నీ వాస్ సమర్పణలో ఈ సినిమా రాబోతుంది.

Exit mobile version