మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “వార్ 2”. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఓటిటిలో ఎలాగో విడుదలకి తీసుకురావాలి.
మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులపై ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ లేదు. మరి లేటెస్ట్ గా దీనిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్, హృతిక్ పై పోస్ట్ చేసి ది వార్ ఈజ్ అఫీషియల్ అంటూ వార్ 2 ఓటిటి హక్కులు తామే తీసుకున్నట్టుగా చెప్పకనే చెప్పేసారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The WaRRR is official ???? pic.twitter.com/Ir4vKJOySd
— Netflix India (@NetflixIndia) May 22, 2025