అలా అంటుంటే చాలా ఆనందంగా ఉంది – తమన్నా

అలా అంటుంటే చాలా ఆనందంగా ఉంది – తమన్నా

Published on Apr 2, 2013 12:50 AM IST

HimmathWala
మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఈ సంవత్సరం ‘హిమ్మత్ వాలా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతోంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కి మీరే శ్రీ దేవి అంటున్నారు దీని పై మీ స్పందన ఏంటి అని అడిగితే దానికి తమన్నా సమాధానమిస్తూ ‘ అలా అందరూ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ అదే టైములో కొంచెం భయంగాను ఉంది. అది పక్కన పెడితే నేను శ్రీ దేవి గారికి పెద్ద ఫ్యాన్, నా కెరీర్ మొత్తంలో ఆమె సాదించిన దానిలో సగం సాధిస్తే చాలు ఎంతో హ్యాపీ గా ఫీలవుతానని’ అంది.

తమన్నా ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘తడాక’ సినిమాలో నటిస్తోంది, బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమాకి సైన్ చేసింది.

తాజా వార్తలు