ఈ శుక్రవారం ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ సినిమా మనముందుకు రానుంది. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ మరియు రాకుల్ ప్రీతి సింగ్ హీరో హీరోయిన్స్. ఈ సినిమాలో రెండు విషయాలు తమ చిత్ర విజయానికి దోహదపడతాయని నమ్మకం వ్యక్తం చేశారు
అదేమిటి అంతే ఈ రోజుల్లో కామెడి వుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడం తధ్యం. అందుకే ఈ సినిమాలో కావలసినంత వినోదాన్ని జోడించారు. మరొకటి ఈ సినిమా స్టొరీ లైన్. దర్శకుడు వినూత్నమైన స్టొరీ లైన్ తో వచ్చాడని ఇంటర్వ్యూలో సందీప్ తెలిపాడు
రమణ గోగుల సంగీత దర్శకుడు. ఈ సినిమా ఎలాంటి అనుభవాన్ని పంచుతుందో చూద్దాం