ఎమోషనల్ అయిన “కలర్ ఫోటో” హీరోయిన్.!

ఈ మధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంచి ఫీల్ గుడ్ చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపాటి బడ్జెట్ లో అయితే మరీనూ.. ఇపుడు అదే తరహాలో ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఆడియెన్స్ చూపును తన వైపు తిప్పుకున్న చిత్రం “కలర్ ఫోటో”. నటుడు సుహాస్ మెయిన్ లీడ్ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మొన్న ఆగష్టు 26 తో షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

అలా ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన టీజర్ పాటలు, ట్రైలర్ అన్నీ ఎంతగానో ఆకట్టుకునుకున్నాయి. అయితే ఏఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన చాందిని చౌదరి ఈ చిత్రం చివరి రోజు షూటింగ్ నాడు ఒకింత ఎమోషన్ అయ్యినట్టు తెలిపింది. ఈ చిత్రంలో తాను చేసిన రోల్ ఎప్పటికీ మర్చిపోను అని అది తన కెరీర్ లోనే ఒక ఫేవరెట్ రోల్ అని తెలిపి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా సాయి రాజేష్ కథ మరియు నిర్మాణం అందించారు. ప్రస్తుతం ఏఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటుంది.

Exit mobile version