పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకి దగ్గరవుతున్న కొద్దీ అంచనాలను రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. మామూలుగానే డాషింగ్ మరియు పంచ్ డైలాగ్స్ రాయడంలో పూరికి మంచి పేరుంది ఆ డైలాగ్స్ కి పవర్ స్టార్ తోడైతే ఎలా ఉంటాయో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ట్రైలర్ లో విడుదల చేసిన డైలాగ్స్ దుమారం రేపుతుంటే ఇప్పుడే పూరి జగన్నాథ్ కొత్త డైలాగ్ ఒకటి కలిపి కేవలం డైలాగ్స్ తో కూడిన ఒక ప్రోమోని విడుదల చేసారు. ఆ డైలాగ్స్ మీకోసం అందిస్తున్నాం..
1. నాకు తిక్క లేస్తే చీమైనా ఒక్కటే, సి.ఎం ఐనా ఒక్కటే..
2. నీ పొగరు కాలిక్యులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను.. నా పొగరు కాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివి బే దానికి నా పొగరు ఒప్పుకోవాలి గా ..
3. రేయ్ ఉంచుకోవడానికి ఉయ్యాలూగడానికి మీడియా ఎవడికీ ఉంపుడు గత్తె కాదు..
పవన్ చెప్పిన ఈ డైలాగ్స్ కి అభిమానుల నుండి మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మిల్క్ బ్యూటీ తమనా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.