చరణ్ “రచ్చ”కి అన్ని కలిసొచ్చాయి

చరణ్ “రచ్చ”కి అన్ని కలిసొచ్చాయి

Published on Apr 3, 2012 4:35 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ” అనుకున్న సమయంలో విడుదల చేస్తున్నారు. ఇది చిత్రానికి చాలా అనువయిన సమయం ఎందుకంటే ఈ చిత్రం గురువారం విడుదల కానుంది ఆరోజు జగ్జీవన్ రాం పుట్టినరోజు కావున జాతీయ సెలవు ఉంటుంది. ఇదే కాకుండా ఈ వారాంతం చాలా పొడవయినదిగా ఉండబోతుంది. శుక్రవారం కూడా “గుడ్ ఫ్రైడే” సందర్భంగా సెలవు, ఇంకా ఈ చిత్రంతో పాటు పెద్ద చిత్రాలు ఏది విడుదల కాకపోవటం చూస్తుంటే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు