నాగ్ సినిమాకి ఈ శుక్రవారమే డెడ్ లైన్

నాగ్ సినిమాకి ఈ శుక్రవారమే డెడ్ లైన్

Published on Nov 1, 2012 2:13 AM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా తొలిసారి నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘డమరుకం’. గత కొన్ని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం సినిమాని ఈ శుక్రవారం లోపు విడుదల తేదీ పై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. అధికారికంగా త్వరలోనే విడుదల తేదీని తెలియజేసే అవకాశం ఉంది. నాగార్జున సరసన యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించారు. సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్. ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించగా, యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినీ ప్రేమికులు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ సినిమా విడుదల తేదీ ఎప్పుడా అనే వార్త కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరిగి విడుదల తేదీ మీద ఒక శుభవార్త రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు