నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ అవైటెడ్ సినిమా కోసం అభిమానులు, పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 4నే పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని ఇది వరకే తెలిపాము. ఇక ఈ ప్రీమియర్స్ కి సంబంధించి లేటెస్ట్ క్లారిటీ ఇంకొకటి వచ్చింది.
ముందు రోజు ప్రీమియర్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా టికెట్ ధరలు మాత్రం భారీగా ఉండవని మేకర్స్ చెబుతున్నారు. అందరికీ అందుబాటు ధరలోనే ఉండేలా పెడతాం అన్నట్టు చెబుతున్నారు. సో ఇది వరకు ఇచ్చిన హైక్స్ లా కాకుండా మీడియం రేంజ్ లో ఈ రేట్స్ ఉండొచ్చు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
