లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న వెంకీ ?

Suriya46

తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారం నుంచి జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ లో సూర్య పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికర టైటిల్‌ ను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో సూర్య పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. అన్నట్టు ఈ చిత్రంలో అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జి వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతకీ, ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version