ఆయన సలహా రాజమౌళిని అలా మార్చింది..!

రాజమౌళి మిస్టర్ కూల్ డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. అంత పెద్ద దర్శకుడైనా రాజమౌళి అసహనంగా మాట్లాడిన సందర్భాలు, కోపంగా మాట్లాడిన సంఘటనలు లేవు. ఆయన మీడియా ముందు, పబ్లిక్ మీటింగ్స్ లో ఎవరినీ నొప్పించకుండా డిప్లమాటిక్ గా మాట్లాడతాడు. ఐతే రాజమౌళి గతంలో చాలా సీరియస్ గా ఉండేవాడట. షూటింగ్ సమయంలో అనుకున్న పని సమయానికి జరగకపోయినా, ఎవరి పని వారు చేయకపోయినా అసహనంతో టెంపర్ కోల్పోయేవాడట. సెట్స్ లో ఎవరో ఒకరిపై ఆ కోపాన్ని చూపించేవాడట.

ఐతే రాజమౌళి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసే సెంథిల్ కుమార్ పదేళ్ల క్రితం ఆయనకు ఓ సలహా ఇచ్చారట. సెట్స్ లో మనం టెంపర్ కోల్పోతే కంట్రోల్ చేయడం కష్టం.. మనం సహనంగా ఉన్నపుడే వారిని బాగా నియంత్రించగలం అని అన్నారట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇక రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లతో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ని జనవరి 8, 2021లో విడుదల చేయనున్నారు.

Exit mobile version