సినీనటి మంజుల విజయకుమార్ ఇకలేరు.!

సినీనటి మంజుల విజయకుమార్ ఇకలేరు.!

Published on Jul 23, 2013 7:00 AM IST

manjula

ఒకప్పుడు హీరోయిన్ గా అందరి మనసులు దోచుకున్న నటి మంజుల విజయకుమార్ ఈ రోజు కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 11: 40 నిమిషాల ప్రాంతంలో ఆమె తుదిశ్వాసని విడిచారు. ఆమె కాస్త ఆనారోగ్యంగా ఉండడంతో ఆమెని చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో జాయిన్ చేసారు, ఆమె అక్కడే కన్ను మూశారు. ప్రస్తుతం ఆమెని బాడీని చెన్నైలోని తన స్వగృహానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంతిమయాత్ర ఉంటుందని అంటున్నారు.

మంజుల తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. తెలుగులో ‘మాయదారి మల్లిగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘దొరబాబు’ మొదలైన తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె భర్త విజయకుమార్ కూడా నటుడే కావడం మరియు ఆమె కుమార్తె శ్రీదేవి కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది.

ఈ సందర్భంగా మంజుల విజయకుమార్ గారి కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు