ఏకంగా 70 దేశాల్లో నోలన్స్ “టెనెట్”.!

ఏకంగా 70 దేశాల్లో నోలన్స్ “టెనెట్”.!

Published on Jul 29, 2020 1:11 AM IST


హాలీవుడ్ సినిమాలు అంటే కేవలం సూపర్ హీరోల చిత్రాలు లేదా యుద్ధాలతో కూడిన భారీ యాక్షన్ లేదా ఇతర సినిమాలు లేదా హర్రర్ సినిమాలు మాత్రమే అనే ముద్ర ఎప్పటి నుంచో మన దగ్గర పాతుకుపోయింది. కానీ వాటన్నిటికీ అతీతంగా సినిమాలు చేసే అద్భుతమైన ఫిల్మ్ మేకర్స్ కూడా అక్కడ చాలా మందే ఉన్నారు. అలాంటి ముఖ్యమైన దర్శకుల్లో “క్రిస్టోఫర్ నోలన్” కు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

కేవలం స్కై ఫై చిత్రాలను మాత్రమే కాకుండా కాలంతో ఆడుకొనే సినిమాలను తీసి ఒక సరికొత్త ఎక్స్ పీరెన్స్ ను ఫిల్మ్ లవర్స్ ను ఆయన అందిస్తాడు. దానినే మైండ్ బెండింగ్ ఎక్స్ పీరెన్స్ అంటుంటారు. అంటే ఈ డైరెక్టర్ మేకింగ్ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. అలా తాను తీసిన సినిమాలలో “ఇంటర్ స్టెల్లార్”, “డార్క్ నైట్” అలాగే “ఇన్సెప్షన్” సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం మన దగ్గర ఆడియెన్స్ లో ఏర్పర్చుకున్నాయి.

కాలంతో ఆడుకునే ఈ డైరెక్టర్ కే ఇప్పుడు కాలం బ్రేక్ వేసింది. తాను లేటెస్ట్ గా తీసిన స్కై ఫై చిత్రం “టెనెట్” ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బతో ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినా నోలన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలని స్టిక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి ఈ సినిమా విడుదలకు నోచుకోనుంది.

అది కూడా ఏకంగా 70 దేశాల్లో విడుదల కానున్నట్టుగా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారు ఈ సోమవారం అధికారికంగా అనౌన్స్ చేసారు. ఆగష్టు 26 న 70 దేశాలలో విడుదల చేయనుండగా యూఎస్ లో మాత్రం కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో మాత్రం సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా రాబర్ట్ పాటిన్సన్, డింపుల్ కపాడియా తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు