మెగాస్టార్ కి హీరోయిన్ సమస్య.. !

మెగాస్టార్ కి హీరోయిన్ సమస్య.. !

Published on Mar 19, 2020 2:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో నటించాల్సిన త్రిష సినిమా నుండి తప్పుకోవడంతో.. ఇప్పుడు చిత్రబృందం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయలేక సతమతమవుతోందట. త్రిష తప్పుకోగానే చిత్రబృందం కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆమె రెమ్యునిరేషన్ కాస్త ఎక్కువ అడిగే సరికి మరో హీరోయిన్ కోసం చూస్తున్నారట. ఈ క్రమంలోనే అనుష్క పేరు కూడా అనుకున్నారట. అలాగే మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్ గా హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలి అనే విషయంలో మేకర్స్ తేల్చుకోలేకపోతున్నారట. దీనికితోడు కరోనా దెబ్బకు షూటింగ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇటివలే ఆ పాట‌ను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. మరోవైపు చిత్రంలో చరణ్ అతిధి పాత్ర చేస్తారనే టాక్ ఉన్నా ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ అందలేదు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.

తాజా వార్తలు