మెగా ఫ్యామిలీలోనే అకీరా పెద్ద స్టార్ కావాలి- చిరు

మెగా ఫ్యామిలీలోనే అకీరా పెద్ద స్టార్ కావాలి- చిరు

Published on Apr 8, 2020 4:21 AM IST

నేడు మెగా ఫ్యామిలీలో రెండు పండగలు. ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా, మరొకటి పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా పుట్టిన రోజు. వీరిద్దరి పుట్టినరోజు ఏప్రిల్ 8కావడం విశేషం. ఇక మెగా ఫ్యామిలీ పెద్ద చిరంజీవి వీరిద్దరికి తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఉదయం అల్లు అర్జున్ లోని కృషి, పట్టుదల నాకు ఇష్టం, నువ్వు బాగుండాలబ్బా అని ట్వీట్ చేసి విషెష్ చెప్పిన ఆయన, అకీరాకు కూడా బర్త్ డే విషెష్ చెప్పారు. ”మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4″). అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.విష్ యు ఏ పవర్ ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్ డే అకిరా..! అని ట్వీట్ చేశారు.

అలాగే అకీరా చిన్నపిల్లాడిగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ల మొదటి సంతానం అకీరాకి ఇప్పుడు 16ఏళ్ళు. ఇప్పటికే అకిరా మెగా హీరోలందరిలో అందరికంటే ఎక్కువ హైట్ ఎదిగాడు. ఇప్పటివరకు వరుణ్ తేజ్ మెగా హీరోలలో హైట్ కాగా దానిని అకిరా అధిగమించాడు. ఫ్యూచర్ లో కూడా మెగా హీరోలందరినీ మించిన స్టార్ అవ్వాలని చిరు కోరుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు