అందుకే మీసం తీసేశా అంటున్న చిరు

అందుకే మీసం తీసేశా అంటున్న చిరు

Published on Jul 23, 2020 11:25 AM IST

దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి, యంగ్ స్టార్స్ కి గట్టి పోటీ ఇస్తూ రేసులో దూసుకెళుతున్నారు. పాలిటిక్స్ కి టాటా చెప్పి ఆయన 2017లో రీ ఎంట్రీ ఇచ్చారు. కమ్ బ్యాక్ తరువాత ఆయన చేసిన ఖైదీ 150, సైరా చిత్రాలు టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రాల లిస్ట్ లో చేరాయి. కాగా లేటెస్ట్ చిరు లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. ఆయన మీసం తీసేసి క్లీన్ షేవ్ లో కనిపించారు. లేటెస్ట్ లుక్ లో చిరు చాలా యంగ్ గా కనిపించడం విశేషం.

చిరంజీవి తాజా మేకోవర్ ఆచార్య మూవీ కోసమే అని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా, చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ లేకపోవడంతో జస్ట్ కాజ్యువల్ గా మీసం తీశానని అంతకు మించి ఇందులో మరో కారణం లేదన్నారు. ఇక త్వరలో చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు