కేఎఫ్‌సీ చికెన్‌ వండిన మెగాస్టార్ !

కేఎఫ్‌సీ చికెన్‌ వండిన మెగాస్టార్ !

Published on Nov 1, 2020 9:00 PM IST

కేఎఫ్‌సీ చికెన్‌ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మరి అలాంటి చికెన్ ను ఎలా చేయాలో మెగాస్టార్ తన మనవరాల్లతో కలిసి చేసి చూపించారు. ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి వంటలను కూడా చ‌క్క‌గా వండుతారు. పైగా లాక్ డౌన్ లో మిగతా సెలబ్రిటీలు లాగే మెగాస్టార్ కిచెన్‌లో ఘుమ ఘుమలాడించారు. అప్పుడప్పుడు కొత్త రుచులని, సరికొత్త వంటకాలని పరిచయం చేస్తూ.. ప్రేక్షకుల చేత వహ్వా అనిపించుకున్నారు. తాజాగా
కేఎఫ్‌సీ చికెన్ వండి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా కేఎఫ్‌సీ చికెన్ కి కావాల్సినవి..
చికెన్ పీసెస్ – 6(రెండు సెట్స్), పాలు – 1 కప్పు, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్లు, వైట్ పెప్పర్ – 1 టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, నిమ్మకాయ – 1, గుడ్లు – 2, మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బ్లాక్ పెప్పర్ – 1 టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఆరిగానో లీవ్స్ – కొద్దిగా, ఐస్ వాటర్ – 1 కప్పు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా వీటితో మెగాస్టార్ చికెన్ ఎలా చేశారో కింద వీడియోలో చూడండి. వంటలోని తన నైపుణ్యాన్ని చూపిస్తూ.. వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇక కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/tv/CHDKcPEjifd/?igshid=1h937ywmaz17e

తాజా వార్తలు