చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ లేనట్లే..!

చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ లేనట్లే..!

Published on Apr 27, 2020 9:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రక్క కొరటాల శివతో మూవీ చేస్తూనే తన కొత్త సినిమాలకు సంబందించిన ప్రణాళికలు వేస్తున్నారు. ఆయన ఇప్పటికే ముగ్గురు దర్శకులతో చర్చలు జరపడం జరిగింది. మలయాళ హిట్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నాడు. ఆ మూవీ తెరకెక్కించే బాధ్యత దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. అలాగే దర్శకుడు బాబి మరియు మెహర్ రమేష్ కథలతో కూడా ఆయన ఏకీభవించినట్లు తెలుస్తుంది.

ఆచార్య మూవీ తరువాత ఆయన ఈ ముగ్గురు దర్శకులతో వరుసగా సినిమాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే ఎప్పటి నుండో చిరంజీవి త్రివిక్రంతో మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఇప్పట్లో వీరిద్దరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే సూచనలు ఐతే కనిపించడం లేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఆ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు