బావ బర్త్ డే జరుపుకున్న చిరంజీవి

బావ బర్త్ డే జరుపుకున్న చిరంజీవి

Published on Jan 5, 2012 1:36 PM IST


ఏ కార్యక్రమం చేసినా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆయన బావ అల్లు అరవింద్ గారు కలిసే చేస్తారు అని చెప్పడానికి మరో ఉదాహరణ. ఆలు అరవింద్ గారు తెలుగు క్యాలెండర్ ప్రకారం వైకుంట ఏకాదశి నాడు తన పుట్టిన రోజు జరుపుకుంటారు. ఈ రోజు వైకుంట ఏకాదశి కాగా ఆయన ఈ రోజు తన పుట్టిన రోజుగా జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా చిరు ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ తిరుపతిలో ప్రత్యేక పూజలు చేసి జరుపుకుంటున్నారు. సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య గారి కొడుకైన అల్లు అరవింద్ నేతోతో 63 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు.

ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ అల్లు అరవింద్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు