అమితాబ్ భారీ సాయానికి చిరు బిగ్ థ్యాంక్స్

అమితాబ్ భారీ సాయానికి చిరు బిగ్ థ్యాంక్స్

Published on Apr 17, 2020 10:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కి కృతజ్ఞలు తెలిపారు. టాలీవుడ్ కోసం ఆయన చేసిన భారీ సాయానికి ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన పెద్ద మనసుని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినీ కార్మికుల కోసం అమితాబ్ 12000 కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఒక్కొక్క కూపన్ విలువ 1500 రూపాయలు కాగా.. వీటిని బిగ్ బజార్ లో షాపింగ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం కూపన్స్ విలువ 1.8 కోట్ల విలువ కావడం గమనార్హం. చిత్ర పరిశ్రమలన్నీ ఒక కుటుంబంగా భావించి అమితాబ్ ఈ సాయం చేశారని చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

ఇక చిరంజీవి ఇప్పటికే కరోనా వైరస్ చారిటీ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేశారు.తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్స్, ప్రముఖులు ఈ ఛారిటీకి విరివిగా విరాళాలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే పనిలో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న సినీ కార్మికుల అవసరాలకు ఈ నిధులు వినియోగిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు