హీరోలకు అభిమానులు చాలా అవసరం. స్టార్ హీరో స్టార్ డమ్ అతనికి ఉన్న అభిమానుల సంఖ్య పై ఆధారపడి ఉంటుంది. ఐతే ఈ అభిమానులు తమ హీరోలపై చూపించే ప్రేమాభిమానాలు అప్పుడప్పుడు హద్దు మీరుతూ ఉంటాయి. దీనితో స్టార్ హీరోలు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ లో ఈ ఫ్యాన్ వార్స్ లేవనే చెప్పాలి. ఈ తరం స్టార్ హీరోలు చాలా సఖ్యతగా ఉంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన చరణ్, నందమూరి ఫ్యామిలీ కి చెందిన ఎన్టీఆర్ చాలా స్నేహంగా ఉంటున్నారు.
టాలీవుడ్ లో చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాన్ వార్ ఉంటూ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ కోసం వీరిద్దరూ కలిసి నటించి సంచలనానికి తెరలేపారు. కాగా ఈ విషయాన్ని చిరంజీవి ప్రస్తావిస్తూ స్టార్ హీరోల మధ్య స్నేహం ఉండడం చాలా మంచి పరిణామం అన్నారు. దీని వలన వారి ఫ్యాన్స్ లో కూడా స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. నేను ఎప్పుడూ ఇతర హీరోలతో స్నేహం గా ఉండడానికి పరితపించే వాడిని అన్నారు. ఈ విషయంలో చరణ్ నన్ను అనుసరిస్తున్నారు. చరణ్ మరియు ఎన్టీఆర్ ల మధ్య స్నేహం చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది అన్నారు.