లాక్ డౌన్ లో ఎంటరైన్మెంట్ లేక అల్లాడిపోతున్న సినీ ప్రేకుకులకు బుల్లి తెరపై వచ్చే సినిమాలు కొంచెం ఉపశమనం కలిగిస్తున్నాయి. దీనితో ప్రముఖ టీవీ ఛానళ్ళు ఆసక్తికర సైనిమాలతో వీక్షకులను ఆకట్టుకొనే పనిలో నిమగ్నం అవుతున్నారు. ఐతే మెగాస్టార్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఈ టీవీ సిద్ధం చేసింది. చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో కొన్ని చిత్రాలు నేటి నుండి వరుసగా ప్రసారం కానున్నాయి. 80-90 లో చిరు నటించిన కొన్ని మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ రోజుకొకటి చెప్పున ప్రసారం చేయనున్నారు.
సోమవారం అనగా నేడు జేబు దొంగ చిత్రం తో మొదలుకొని మగమహారాజు, ఖైదీ నం.786, అడివిదొంగ, చంటబ్బాయ్, దొంగ మొగుడు చివరిగా రక్త సింధూరం వారం మొత్తం ప్రసారం కానుంది. ప్రతి రోజు సాయంత్రం ఈటీవీలో 7:00 గంటలకు ఈ చిత్రాల ప్రసారం ఉంది. చిరంజీవి సినిమాల్లోని అన్ని జోనర్స్ ని మిక్స్ చేసిన ఈ కాంబో పిక్చర్స్ విశేష ఆదరణ దక్కించుకోవడం ఖాయం.