ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర చూసిన సాలిడ్ క్లాష్ చిత్రాలలో ఈ ఆగష్టు 15 కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాలు సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జునల కూలీ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ ల కలయికలో వచ్చిన చిత్రం “వార్ 2” ల క్లాష్ అని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో మరింత ఆసక్తి నెలకొనగా రెండు చిత్రాలకి కూడా మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ కూడా పడలేదు. అయినప్పటికీ కూలీ వసూళ్ల పరంగా డామినేట్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఇటీవల ఓటిటిలో వచ్చాయి.
కూలీ ప్రైమ్ వీడియోలో వస్తే వార్ 2 మాత్రం నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈసారి మాత్రం వార్ 2 ధై పైచేయి అయినట్టు తెలుస్తుంది. కూలీ కంటే వార్ 2 కే ఓటిటిలో అత్యధిక రెస్పాన్స్ వచ్చినట్టుగా ఇప్పుడు టాక్. అయితే కూలీ మొదట్లో హిందీ వెర్షన్ రాలేదు కానీ వార్ 2 మాత్రం హిందీ కలిపే వచ్చింది. దీనితో ఈ వ్యత్యాసం ఉండి ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా మాత్రం ఓటిటిలోకి వచ్చిన ఎర్లీ రోజుల్లో వార్ 2 రెస్పాన్స్ నే ఎక్కువ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.