రాజమౌళిని ప్రశంసించిన చిరంజీవి


తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా నమోదయిన సంచలనం “ఈగ” చిత్రానికి ప్రశంశల వర్షం ఆగట్లేదు. పరిశ్రమలో పెద్ద తారలందరు ఈ చిత్రాన్ని ప్రశంశిస్తూ వస్తున్నారు ఈరోజు ఈ చిత్రాన్ని చిరంజీవి గారు మెచ్చుకున్నారు.”చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు ఈ సిఎనం చాలా నచ్చింది నిజానికి అయన రెండు రోజుల క్రితమే మెసేజ్ చేసారు కాని ఎవరిదో నెంబర్ అనుకోని పట్టించుకోలేదు చాలా భాధ అనిపించింది అందులో అయన “ఈగ తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం” అని మెసేజ్ చేశారు” అని ట్విట్టర్లో చెప్పారు. ప్రస్తుతం సమంత తప్ప మిగిలిన “ఈగ” బృందం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా విజయయాత్ర నిర్వహిస్తున్నారు. ఈరోజు “ఈగ” చిత్ర బృందం కరీంనగర్, వరంగల్, హన్మకొండ మరియు ఖమ్మంలో ఈ యాత్ర నిర్వహించారు. సుదీప్. నాని, సురేష్ బాబు, సెంథిల్, తాగుబోతు రమేష్ మరియు పీటర్ డ్రాపర్, రాజమౌళితో కలిసి ప్రేక్షకులతో మాట్లాడారు.

Exit mobile version