ఇండియన్ సినిమా స్థాయిని పెంచే పనిలో చిరంజీవి

Chiranjeevi
పర్యాటక శాఖామంత్రి చిరంజీవి ప్రస్తుతం మకౌలో ఉన్నాడు. అక్కడ ఆయన కొన్ని ఫిల్మ్ కూటములతో కలిసి ఇండియన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకు రావడం కోసం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ గురించి చర్చిస్తున్నారు. మకౌలోని ఫిల్మ్ మేకర్స్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖులు, మీడియా వారు ప్రస్తుతం ఆయన జరుపుతున్నారు.

‘ఇండియాని బెస్ట్ ఫిల్మ్ టూరిజం ప్రాంతంగా ప్రమోట్ చెయ్యడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. మా మంత్రి వర్గం ఫారిన్ ఫిల్మ్ మేకర్స్ కి కావాల్సిన పర్మిషన్స్ అన్నిటినీ ఒకే సారి అందించేలా నిర్ణయం తీసుకున్నాం. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాం. మనం విదేశాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి వారు ముందే అన్ని ఏర్పాట్లు చేస్తారు అలాగే కొంతమంది మనతోనే ఉంది ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు. వారిలానే మనం కూడా ఇండియాలో షూట్ చెయ్యాలనుకున్నవారికి కూడా కల్పించనున్నామని’ చిరంజీవి అన్నారు.

ఈ విషయం తర్వాత చిరు కాసేపు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘ నేను సినిమాలు చేయడం మానెయ్యగానే చరణ్ ఆ స్థానాన్ని భర్తీ చెయ్యడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి మళ్ళీ వెనక్కి వచ్చి నటించాలనే ఆలోచన ఏమీ లేదు, నాదారిలో నడుస్తూ నా స్థానాన్ని చరణ్ భర్తీ చేస్తున్నాడు. గతంలో అమితాబ్ బచ్చన్ పోషించిన ‘జంజీర్’ లాంటి సినిమా రీమేక్ లో ఆయన పోషించిన పాత్రని చరణ్ పోషించడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఆ సినిమా చరణ్ కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతుందన్న నమ్మకం ఉందని’ అన్నాడు.

Exit mobile version