సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి మృతిపై చిరంజీవి సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి మృతిపై చిరంజీవి సంతాపం

Published on Feb 11, 2020 4:30 PM IST

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పీఆర్ఓ పసుపులేటి రామారావు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆయనను ఆదివారం వనస్థలిపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. వివిధ పత్రికలలో నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే సినిమా పరిశ్రమతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినిమా సీనియర్ హీరోలందరినీ ఆయన ఇంటర్వ్యూలు చేశారు.

అలాగే ఆయన ఆత్మకథ రాసుకున్న తొలి ఫిలిం జర్నలిస్టుగా పేరు గడించారు. రామారావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా మిత్రులు సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోను అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. రామారావు మరణం కలిచివేసిందని.. తమ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ప్రెస్ నోట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

https://twitter.com/mokris_1772/status/1227176758505398272?s=20

https://twitter.com/sivakoratala/status/1227178891875209217?s=20

తాజా వార్తలు