ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో చిరు మంతనాలు.. అంతా వట్టిదే అంటూ క్లారిటీ..!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ కు నిర్మాతల మండలికి మధ్య విభేదాలు తలెత్తడంతో సినిమా కార్మికులు స్ట్రైక్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కార్మికుల వేతనాలు పెంపుదలపై నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఛాంబర్ పేర్కొంది.

అయితే, ఇటీవల కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో భేటి అయ్యారు. ఈ సమస్య గురించి కొద్ది రోజుల్లో పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. కాగా, ఇప్పుడు కొందరు వ్యక్తులు తాము ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని.. చిరంజీవితో భేటి అయ్యామని.. ఆయన తమ వేతనాలు 30 శాతం పెంచేందుకు అంగీకరించారని ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం చిరు వరకు వెళ్లింది.

దీంతో ఆయన తాజాగా ఈ విషయంపై స్పందించారు. తన వద్దకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఎవరూ రాలేదని.. తాను ఎవరితోనూ భేటి కాలేదని.. సినిమా కార్మికుల వేతనాల పెంపుపై తాను ఒక్కడినే నిర్ణయం ఎలా తీసుకోగలనని.. ఫిలిం ఛాంబర్ చేతిలోనే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. అంతవరకు అందరూ సంయమనం పాటించాలని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని తాను కోరుతున్నట్లు చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Exit mobile version