యంగ్ టాలెంట్స్ తో చిరు సోషల్ మెస్సేజ్ అదిరింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుకోగా చిరంజీవి సామాజిక సందేశంలో కూడిన షార్ట్ వీడియోస్ తో ముందుకు వచ్చారు. హీరో కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బాలతో మాస్క్ ధరించడం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ లఘు చిత్రాలు చేశారు. ముఖంపై చిరునవ్వు కనిపించడం కన్నా, మగాడిగా మీసం తిప్పడం కన్నా కూడా మాస్క్ ధరించడమే అసలైన అందం, వీరత్వం అని చిరంజీవి తెలియజేశారు. ఈ సామాజిక సందేశం కూడిన వీడియోలు రూపొందించడంలో సహకరించిన హీరో కార్తికేయ, ఈషా రెబ్బా మరియు టీమ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య అనే మూవీ చేస్తున్నారు. సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు తో ఆచార్య మూవీ తెరకెక్కుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version