ఆచార్య ఆలస్యం అయ్యేలా ఉంది…అందుకే చిరు..!

ఆచార్య ఆలస్యం అయ్యేలా ఉంది…అందుకే చిరు..!

Published on Jul 19, 2020 10:26 PM IST

గత ఏడాది సైరా తో బాక్సాఫీస్ దుమ్ము దులిపారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా ఆ మూవీ నిలిచింది. ఆ మూవీ విడుదలైన వెంటనే పెద్ద గ్యాప్ తీసుకోకుండా చిరంజీవి దర్శకుడు కొరటాల మూవీ షూటింగ్ లో జాయిన్ కావడం జరిగింది. దాదాపు 40 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి బంద్ అయ్యింది. దీనితో ఈ దసరాకు మూవీ విడుదల చేయాలనుకున్న వారి ప్రణాళిక చెడింది.

ఇక కరోనా ప్రభావం హైదరాబాద్ లో అధికంగా ఉంది. అలాగే ఇప్పట్లో వైరస్ వ్యాప్తి వెనుకాడే సూచనలు కనిపించడం లేదు. దీనితో షూటింగ్ కి హాజరు కావడానికి ఎవరు ఇష్టపడం లేదు. కాగా ఖాళీగా ఇంటిలో ఉంటున్న చిరంజీవి తన జీవిత చరిత్రపై ఫోకస్ పెట్టాడట. ఎప్పటి నుండో చిరంజీవి ఆటో బయోగ్రఫీ రాసుకుంటున్నారు. అలాగే తన జీవితంలోని ముఖ్యఘట్టాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి బయో పిక్ తెరకెక్కే సూచనలు ఉన్నాయని తెలుస్తుండగా, వారికీ చిరంజీవి రాసిన ఆటో బయోగ్రఫీ బాగా ఉపయోగపడుతుంది . ఇక ఆచార్య మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

తాజా వార్తలు