పూల రంగడు చిత్రం లో సునీల్ కష్టానికి చాలా అభినందనలు వచ్చాయి. చిత్రం కోసం 30 కిలోలు తగ్గి సిక్స్ ప్యాక్ పెంచి చిత్రం లో నృత్యం కోసం సునీల్ చాలా కష్టపడ్డారు. పరిశ్రమ పెద్దలు చాలా మంది సునీల్ ని ఈ విషయమై అభినందించారు ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి గారు సునీల్ ని అభినందించారు ఒక ప్రముఖ టి వి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పూల రంగడు చిత్రం లో సునీల్ డాన్స్ ని కొనియాడారు. ఈ వార్త విని సునీల్ మేఘాల్లో తెలిపోతుంటారు. వీరభద్రమ్ దర్శకత్వం వహించిన పూల రంగడు చిత్రం విజయవంతమయ్యింది ప్రస్తుతం సునీల్ తను వెడ్స్ మను చిత్ర రిమేక్ లో నటిస్తున్నారు.