ఒరిస్సా మహిళా పోలీసుకు చిరు అభినందనలు..కారణం?

ఒరిస్సా మహిళా పోలీసుకు చిరు అభినందనలు..కారణం?

Published on May 12, 2020 11:50 AM IST


వేదిక ఏదైనా తన పంథానే బిన్నం అని చిరంజీవి నిరూపించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలోకి ఎంటరైన చిరంజీవి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, సామాజిక అంశాల పట్ల స్పందించడం అబ్బుపరపరుస్తుంది. తాజాగా ఆయన ఒరిస్సాకు చెందిన ఓ మహిళా పోలీసుతో స్వయంగా ఆన్లైన్ లో మాట్లాడారు. ఆమె సేవా దృక్పధాన్ని ఆయన అభినందించారు. శుభశ్రీ అనే ఓ మహిళా పోలీసు, మానసిక మరియు శారీకర వికలాంగు రాలైనా ఓ మహిళకు చేసిన సేవలు ఆయన దృష్టికి రావడంతో చిరంజీవి స్వయంగా మాట్లాడి అభినందించడం జరిగింది.

ఇక చిరంజీవి స్వయంగా ఆమెను అభినందించడంతో సదరు మహిళా పోలీసు ఆనందం వ్యక్తం చేసారు. చిరంజీవి మాట్లాడనున్నారు అని తెలుసుకొని ఎక్సయిట్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక మీ సేవా కార్యక్రమాల గురించి తెలుసు అన్న ఆమె, మీ సినిమాలు చాల చూశాను. మీకు చాలా పెద్ద అభిమానిని అని చెప్పారు. దాదాపు రెండు నిమిషాలకు పైగా వీరి మధ్య సంభాషణ జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు